హాలీ సందర్భంగా నిర్వహించిన పార్టీ హింసాత్మకంగా మారింది. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. హింసాత్మక దాడిలో ముగ్గురు మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీహార్లోని ఒకే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు శివారులోని అనేకల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో పనులు చేస్తున్నారు.