ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దశలో తల్లి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మొదటిలో మత్తు నిద్ర వస్తుంది. కానీ చివరి నెలకు చేరుకున్న తర్వాత నిద్ర అనేది లేకుండా పోతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు కాళ్లు, చేతులు, మెడకు మసాజ్ లాంటివి చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. అలాగే కొంచెం సేపు నడవడం కూడా మంచిది.