AP: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిచ్చారు. ‘కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదు, పెంచదు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ మోహన్ రెడ్డిదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచి, వాళ్లే ప్రశ్నిస్తున్నారు.’ అని అన్నారు.