టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. భారత జట్టుకు రోహిత్ శర్మ చేసిన సేవకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకు కూడా పాకింది. 'కాంగ్రెస్ కా బాప్ రోహిత్' అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 81.2 వేల ట్వీట్లు పడ్డాయి.