భూమా అఖిలప్రియ సోదరుడిపై సీఎంవోకు ఫిర్యాదు

76చూసినవారు
భూమా అఖిలప్రియ సోదరుడిపై సీఎంవోకు ఫిర్యాదు
AP: నంద్యాల కలెక్టరేట్‌లో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్థానంలో ఆమె సోదరుడు, ఆళ్లగడ్డ టీడీపీ నేత విఖ్యాత్‌ రెడ్డి హాజరవడం వివాదాస్పదమైంది. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ తో పాటు విఖ్యాత్‌ రెడ్డి వేదికపై కూర్చుని అధికారులను ప్రశ్నించారు. దీనిని మంత్రులు తప్పుబట్టారు. విఖ్యాత్ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్