సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోరికార్డులు నెలకొల్పారు. అయితే అందులో ఒక రికార్డు మాత్రం చాలా ప్రత్యేకమైనది. అదే సచిన్ 'వంద శతకాల రికార్డు'. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ సెంచరీ చేసి నేటికి సరిగ్గా 13 ఏళ్లు గడిచాయి. ఆసియా కప్‌లో భాగంగా మార్చి 16, 2012న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ (114) 147 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీ బాదాడు.