దేశానికి మోదీ అవసరం ఉంది: చంద్రబాబు

59చూసినవారు
దేశానికి మోదీ అవసరం ఉంది: చంద్రబాబు
గత పదేళ్లలో మోదీ అద్భుతంగా పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడోసారి ఆయనే ప్రధాని కానున్నారని చెప్పారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన వారణాసి ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ను ఉద్దేశించి పవిత్ర క్షేత్రంలో ఇదొక చారిత్రక సందర్భమని అన్నారు. భారత్ కు మోదీ అవసరం ఉందని.. అంతర్జాతీయంగా మన దేశం కీలకంగా మారనుందన్నారు. ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్