AP: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కురిడింగి గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాతపట్నానికి చెందిన వెంకట ప్రసాద్ (56), వాణి (45) అనే దంపతులు కారులో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.