ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెండ్యాల ప్రభాకర్ అనే రైతును దుండగులు కత్తులతో పొడిచి హత మార్చారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.