రెండు చేతులు లేకున్నా కాలి బొటన వేలితో ఓటు వేసిన యువకుడు (వీడియో)

56చూసినవారు
రెండు చేతులు లేకున్నా సరే ఓ యువకుడు తన కాలి బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు. తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టకతోనే రెండు చేతులు లేవు. దీంతో జాకీర్ పాషా గురువారం తన కాలి బొటన వేలితో ఓటు వేశాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతొంది.

సంబంధిత పోస్ట్