AP: కూటమి మహిళా మంత్రి సంధ్యా రాణిపై వైసీపీ ఫైర్ అయ్యింది. తాగునీరు ఇవ్వాలంటూ మన్యం జిల్లా గురువినాయుడుపేట మంత్రిని చుట్టుముట్టారు. 'తాగు నీరు ఇవ్వాలన్న మహిళలను నడిరోడ్డుపై నిలబెట్టి మంత్రి అవమానించారు. దాదాపు ఐదు నెలలుగా పంచాయితీ సెక్రటరీకి సమస్యలు చెబుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రికి చెబితే.. ఆమె వెళ్లి సెక్రటరీనే అడగండని అన్నారు. మహిళల కష్టాలు మీకు ఎగతాళి అయిపోయాయా చంద్రబాబు?' అని ప్రశ్నించింది.