బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది రోజే ప్రారంభించినట్లు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. యుగం నేటితోనే ప్రారంభం అయింది కనుక పండుగను ఇలా చేసుకోవడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచి, అభ్యంగస్నానం చేసి దేవతారాధన చేయాలి. వేపపూత, బెల్లం, మామిడి ముక్కలు, నెయ్యిని భగవంతుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే సంవత్సరమంతా మంచి జరగాలని కోరుకుంటూ దానధర్మాలు చేయడం మంచిదని పండితులు వివరిస్తున్నారు.