AP: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలో గత కొంతకాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ప్రేమజంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతులు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని స్థానికులు పోలీసులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి అఘాయిత్యానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.