AP: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ మాధురి సంచలన ఆరోపణలు చేసింది. దువ్వాడను ఏ క్షణమైనా మట్టుపెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ కుట్రలో బాగంగానే బిల్లు చెల్లించిన తర్వాత కూడా తమ ఇంటికి కరెంట్ కట్ చేసారని వాపోయింది. ఆయనకు ప్రమాదం పొంచి వుందని తెలిసినా ప్రభుత్వం గన్ మెన్ ను తొలగించడపంపై అనుమానం వ్యక్తం చేసింది.