ఎయిర్ హోస్టెస్‌ని కొరికిన ప్రయాణీకురాలు (వీడియో)

65చూసినవారు
షెన్‌జెన్ నుండి షాంఘై వెళ్లే విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షెన్‌జెన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరూ మహిళా ప్రయాణికులు తమ శరీర దుర్వాసన, పెర్ఫ్యూమ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యం అయ్యింది. ఇంతలో ఎయిర్ హోస్టెస్ వారి వద్దకు వెళ్లి గొడవను ఆపాలని ప్రయత్నించారు. ఇంతలో ఓ మహిళ ఎయిర్ హోస్టెస్‌పైకి దాడికి దిగి చేతిని కొరికేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్