పేకాట స్థావరాలపై పోలీసులు దాడి

83చూసినవారు
పేకాట స్థావరాలపై పోలీసులు దాడి
పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు టౌన్ పోలీసులు తెలిపారు. మంగళవారం కొవ్వూరు మండలంలోని వాడపల్లి వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడి చేశామన్నారు. పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1550 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.