పిఠాపురం పట్టణంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వి. వెంకటఅపర్ణ ఎదుట మంగళవారం పోలీసులు నిందుతులను హాజరు పరిచారు. పిఠాపురం స్టేషన్ నుంచి 8 మందిని హాజరు పరచగా రూ. 10 వేలు చొప్పున జరిమానా విధించారని ఎస్సై గుణశేఖర్ తెలిపారు. గొల్లప్రోలు స్టేషన్ నుంచి పదమూడు మందిని మేజిస్ట్రేట్ వి. వి. అపర్ణ ఎదుట హాజరు పరచగా రూ. 1. 30 లక్షలు జరిమానా విధించినట్లు గొల్లప్రోలు ఎస్ఐ ఎన్. రామకృష్ణ తెలిపారు.