కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం ఇటీవల జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న రౌతులపూడి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కోళ్ల రాంబాబును రౌతులపూడి జడ్పీ స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ షేక్ సలీం శుక్రవారం సన్మానించారు. సలీం మాట్లాడుతూ ఈ స్కూలు అభివృద్ధికి రాంబాబు మాస్టర్ సేవలు మరువలేనివని అటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరమని సలీం అన్నారు.