తూర్పు గోదావరి జిల్లాలో భానుడు ఉగ్రరూపం

57చూసినవారు
తూర్పు గోదావరి జిల్లాలో భానుడు ఉగ్రరూపం
తూర్పు గోదావరి భానుడు ఉగ్రరూపం దాల్చాడు. జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. గత వారం రోజులుగా భానుడు 40 డిగ్రీలకు చేరువయ్యాడు. శుక్రవారం రాజమండ్రి ఉష్ణోగ్రత గరిష్టం 44. 0 కనిష్టం 24. 0గా నమోదైంది. ఎండదెబ్బకు రాజమండ్రితో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాలు, గ్రామాల్లో ఎండ తీవ్రంగానే కాసింది. దీంతో ప్రజలు మలమలమాడిపోయారు. కాగా ఎండ తీవ్రత అమాంతం పెరగడంతో వడగాడ్పులు వీచాయి.

సంబంధిత పోస్ట్