ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన విజయవాడ, ఇతర ప్రాంతవాసులకు రాజమండ్రి రూరల్ నియోజవర్గంలో రూ. 83, 44, 624/- సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ఈ మొత్తాన్ని బుధవారం సాయంత్రం చెక్కు రూపంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నియోజవర్గ కూటమి నాయకులను, ప్రజలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.