భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన విజయవాడలోని 5వ వార్డులో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో బాధితులకు ఆహారం అందజేశారు. ఎవరికి ఎటువంటి ఆపద కలవకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఉన్నతాధికారులతో నిత్యం పరిస్థితిని సంక్షిస్తున్నారు.