రోళ్లపాలెంలో భయపెట్టిన పొడపాము

58చూసినవారు
అమలాపురం పరిధిలోని రోళ్లపాలెంలో ఒక ఇంటి ఆవరణలో గురువారం పొడపాము ప్రవేశించింది. భయభ్రాంతులకు గురైన ఇంట్లోని వ్యక్తులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పాములు కనిపిస్తే ఎవరు చంపవద్దని, తనకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్