అల్లవరం మండలం ఓడలరేవులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చమురు సంస్థ ఓఎన్జీసీలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామస్థులు శనివారం ప్లాంట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ. ఇటీవల ఈ ప్లాంట్లో నూతనంగా పనులు చేపట్టిన కొత్త కంపెనీ ఇతర ప్రాంతాలకు చెందిన వారిని విధుల్లోకి తీసుకుంటూ, స్థానికులకు మొండి చేయి చూపుతోందన్నారు.