ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన పర్యవేక్షణలో అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించి, 191 అర్జీలను అందించారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.