అమలాపురం ఆర్టీసీ డిపోకు ఏడాది కాలంలో 26 కొత్త బస్సులు వచ్చాయని డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆదివారం డిపోలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, వంటి బస్సులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం డిపోలో 100 బస్సులతో పాటు 38 అద్దె బస్సులతో మొత్తం 138 బస్సులు నడుపుతామన్నారు. రోజు 58 వేల కిలోమీటర్లు బస్సులు నడిపి ఇరవై నాలుగు లక్షల ఆదాయం సాధిస్తుందమన్నారు.