అమలాపురం: సేకరించిన భూములను రైల్వేకు అప్పగించాలి: కలెక్టర్

78చూసినవారు
అమలాపురం: సేకరించిన భూములను రైల్వేకు అప్పగించాలి: కలెక్టర్
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే సేకరించిన భూములను స్వాధీనం చేసుకుని రైల్వే శాఖకు అప్పగించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ అధికారులతో రైల్వే లైన్ అలైన్మెంట్, భూముల సేకరణ, స్వాధీనం, అవార్డులు జారీ, భూ నష్టపరిహారాల చెల్లింపు తదితర పెండింగ్ అంశాలపై సమీక్షించారు. మిగిలిన భూముల సేకరణను వేగవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్