అమలాపురం నడిబొడ్డున ఉన్న రైతు బజార్ ప్రారంభించేందుకు కార్యా చరణ చేపట్టామని జేసీ నిశాంతి తెలిపారు. శనివారం రైతు బజార్లో రైతు అవగాహన సదస్సు వివిధ మండలానికి చెందిన రైతులు, ఉద్యాన మార్కెటింగ్, మత్స్య శాఖల అధికారులతో నిర్వహించారు. గత కొంతకాలం క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజారు నెలకొల్పినప్పటికీ, వివిధ కారణాలతో పూర్తిస్థాయిలో నిర్వహణ జరగలేదన్నారు.