సీజనల్ వ్యాధి డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ డీఎం&హెచ్ఓ భరతలక్ష్మి సూచించారు. ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, ఫీవర్ సర్వే చేశారు. శనివారం అడిషనల్ ఆమె అమలాపురం మండలం వన్నెచింతలపూడి, సమనస గ్రామాల్లో పర్యటించారు. వ్యాధుల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని అన్నారు.