గత ఎనిమిది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం వెలుగు యానిమేటర్స్ (వీవోఏ) నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ. యానిమేటర్స్ కాల పరిమితి సర్కిలర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమంగా తొలగించిన వారిని తిరిగి వీధులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.