బొబ్బర్లంకలో ఎస్సీ, బీసీ మత్స్యకారుల మధ్య చిచ్చు పెడుతున్న ఫిషరీస్ శాఖ జిల్లా అధికారి ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకుడు డిమాండ్ చేశారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రొయ్య సీడ్ సేకరణకై జల్లివారి పేట ఎస్సీ మత్స్యకార హక్కులకు చట్టబద్ధత కల్పించాలని, బొబ్బర్లంక - ధవలేశ్వరం గేట్లకు సరిహద్దులు కేటాయించాలని నినాదాలు చేశారు.