కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకాన్ని అర్హత కలిగిన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ కలెక్టర్ మహేశ్ పిలుపునిచ్చారు. అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం సూర్య ఘర్ పథకం అమలు తీరు పురోగతిపై ఆయన అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సోలార్ ప్యానల్ కనెక్షన్ల కొరకు తక్షణమే లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని అధికారులకు సూచించారు.