అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ వద్ద గుర్తుతెలియని అనాధ వ్యక్తి మంగళవారం చనిపోయింది. మృతదేహాన్ని మున్సిపల్ అధికారులు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికకు మంగళవారం తరలించారు. మున్సిపల్ శానిటేషన్ మేస్త్రి మల్లారపు రాజు, శానిటేషన్ సెక్రటరీ సీత మహాలక్ష్మి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.