లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ అందించాలనే లక్ష్యంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా ఇన్‌చార్జి అధికారి పి.రవిసుభాష్ అన్నారు. మంగళవారం అమలాపురం రూరల్ మండలంలోని సవరప్పాలెంలో పింఛన్ల పంపిణీ విధానాన్ని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. నిరంతర పర్యవేక్షణతో ప్రజా సంతృప్తే లక్ష్యంగా ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.