కోనసీమ జిల్లాలో ధాన్యం కనుగోలు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సహకారాన్ని అందించాలని రైస్ మిల్లర్లను జాయింట్ కలెక్టర్ నిశాంతి కోరారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం రైస్ మిల్లర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లర్లు రైతులకు ధాన్యం తరలించుకునే సమయంలో మంచి నాణ్యమైన గోనే సంచులను సరఫరా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై సూచనలు చేశారు.