గత ప్రభుత్వంలో జగన్న లేవుట్లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చారని అధికారులు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదని అమలాపురం మండలం పేరూరు పరిధిలో నారాయణపేట రెడ్డిల కాలనీ వాసులు జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ. అద్దె ఇంట్లో నివాసం ఉంటామని గతంలో తమకు ఇందుపల్లి గ్రామంలో ఇళ్లు పట్టాలు ఇచ్చారని స్థలాలను అధికారులు ఇప్పటివరకు చూపలేదని కలెక్టర్ కు మహిళలు ఫిర్యాదు చేశారు.