అమలాపురం: ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు

70చూసినవారు
ఆర్టీసీ బస్ డ్రైవర్ బి. ఎస్ నారాయణ అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు శనివారం 27వ రోజు రిలే దీక్షలు చేశారు. డ్రైవర్ నారాయణను అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ దీక్షలో డీపో అధ్యక్షుడు ఎండి ఔలియా, కార్యదర్శి మణిరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్