ఈ నెల 13వ తేదీన విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుందని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. అమలాపురం మండలం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జిల్లా స్థాయి అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి ఏడు బస్సులను ఏర్పాటు చేసి, ఈ ఆవిష్కరణ సభకు 350 మందిని తరలించేందుకు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.