సావిత్రిబాయి పూలే బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, మద్యపానం, సతీ సహగమనం వంటి ఉద్యమాల్లో చేసిన పోరాటం నేటికీ మరువలేమని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు పేర్కొన్నారు. అమలాపురం గ్రంథాలయంలో బుధవారం విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నెల మూడో తేదీన అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విప్లవ వైతాళికురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని నిర్వహిస్తున్నామన్నారు.