అమలాపురం వెంకన్న ఆలయం మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న దాతల ఆశయానికి సిబ్బంది తూట్లు పొడుస్తున్నారని ఆలయ మాజీ ఛైర్ పర్సన్ వెంకట విరీతాదేవి విమర్శించారు. శుక్రవారం అమలాపురంలో ఆమె మాట్లాడుతూ దాతలు ఇచ్చిన జనరేటర్ కు షెడ్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వసతుల కల్పన, నిర్వహణలో ఈవో నుంచి క్రిందిస్థాయి సిబ్బంది వరకూ స్వామివారి ఆలయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు.