అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూరు శాతం ఫలితాలు లక్ష్యంగా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నామని ప్రిన్సిపల్ కడియం శిరీష అన్నారు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు అణువుగా స్టడీ మెటీరియల్ ను శనివారం అందజేశారు. ఆమె మట్లాడుతూ ప్రతి ఏడాది ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, ఈ కళాశాలలో చదివిన విద్యార్థినులు ప్రముఖ కాలేజీల్లో సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. హాస్టల్ వసతి ఉందన్నారు.