ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15ఏళ్ల బాలికకు 3 నెలలుగా తరచుగా వాంతులు రావడంతో సోమవారం బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించి సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీనర జుట్టును తొలగించారు. అయితే తన తల వెంట్రుకలు ఆ బాలిక కొన్ని నెలలుగా తింటుందని, పైగా వాటిని నమిలి మింగుతున్నానని బాలికే స్వయంగా చెప్పడం గమనార్హం.