అల్లవరం మండలంలోని బోడసకుర్రు గ్రామంలో పల్లిపాలెం వద్ద గోదావరి వరద ఉధృతిని ఎంపీడీవో కృష్ణమోహన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గోదావరి వరద ఉద్ధృతి మరింత పెరిగితే ముంపునకు గురయ్యే ప్రదేశాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి కల్పించనున్నట్లు తెలిపారు. వరద సహాయక చర్యలు చేపట్టవలసిందిగా పంచాయతీ సిబ్బంది ఆయన సూచించారు. పంచాయతీ కార్యదర్శి దుర్గా శ్రీను పాల్గొన్నారు.