అమలాపురంలోని పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం సాయంత్రం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఆకుమర్తి ఆశీర్వాదం మాట్లాడుతూ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు