అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కోనసీమ జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గాంధీ వర్ధంతి గురువారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కోనసీమ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో గాంధీజీకి పలువురు నివాళులు అర్పించారు.