ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవిల్లి కాలువ గట్టుకు చెందిన ఉండ్రు సతీష్ (30) కరెంటు షాక్ కు గురై మృతి చెందాడు. చిన్నగాడవిల్లిలోని పంచాయతీ పరిధిలోని సోమలమ్మ గుడి ప్రాంతంలో రహదారిపై వాహనంలోకి కొబ్బరికాయ లోడు చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలగడంతో షాకు గురయ్యాడని తోటి కార్మికులు ఆదివారం తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.