బిక్కవోలు జడ్పి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1977-78 సంవత్సరంలో బిక్కవోలు జరిపి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు 47 ఏళ్ల తర్వాత పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో తిరుగుతూ తమ పాత స్మృతులను నెమరు వేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు.