అనపర్తి మండలం కుతుకులూరు లో భక్తాంజనేయ స్వామి వారి జాతర బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు విచిత్ర వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు.