సుబ్రహ్మణ్య స్వామి షష్టిని పురస్కరించుకొని బిక్కవోలు ప్రసిద్ధ గోలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన వీరభద్రుని సంబరంలో బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుమార సుబ్రహ్మణ్యస్వామి దర్శించుకునిఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరంఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.