మామిడికుదురు: పవిత్రోత్సవాలకు భారీ ఏర్పాట్లు

60చూసినవారు
మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి సన్నిధిలో శనివారం నుంచి సోమవారం వరకు జరిగే పవిత్రోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం విశ్వక్సేనారాధనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ఆలయంలో ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ఈవో సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం భారీగా షామియానాలు ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు.

సంబంధిత పోస్ట్