గోపాలపురం: ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

55చూసినవారు
ప్రయాణికులకు ఇబ్బంది కలుగజేస్తే చర్యలు తప్పవని గోపాలపురం ఎస్ఐ గురువారం అన్నారు. మండలంలోని స్థానిక బస్టాండ్ వద్ద తోపుడు బళ్ల వ్యాపారులు బస్టాండును ఇరుకుమయం చేశారు. దీంతో ప్రయాణికులకు ఆటంకంగా మారింది. పలువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సతీష్ స్పందించి తోపుడుబళ్లు అక్కడి నుంచి తీయించారు. బస్టాండ్ లో పార్క్ చేసిన 2 బండ్లను స్టేషన్ కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్